Abn logo
Mar 30 2020 @ 05:50AM

లాక్ డౌన్ పాటించని నలుగురు అధికారులపై చర్యలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 1000 దాటింది. దీనిపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. అదే సమయంలో లాక్ డౌన్ ను  సరిగా పాటించనందుకు ఢిల్లీకి చెందిన  ఉన్నతాధికారులపై వేటు పడింది. ఢిల్లీ  అదనపు చీఫ్ సెక్రటరీ (ట్రాన్స్‌పోర్ట్) రేణు శర్మను సస్పెండ్ చేయగా, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్య గోపాల్‌కు షో కాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) రాజీవ్ వర్మను కూడా సస్పెండ్ చేశారు. సీలాంపూర్ ఎస్ డీఎంకు షో కాజ్ నోటీసు జారీ చేశారు  కాగా ఢిల్లీలో ఒకే రోజులో 23 కేసులు పెరిగాయి. దీనితో ఇక్కడ కరోనా బాధితుల సంఖ్య 72కి చేరుకుంది. ఢిల్లీలో ఆదివారం 23 కొత్త కేసులు నమోదయ్యాయి. 

Advertisement
Advertisement
Advertisement