కరోనా విషయంలో చాలా దేశాలు తప్పుదోవలో వెళ్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-07-14T03:46:52+05:30 IST

ప్రజల సంరక్షణకు సంబంధించి ప్రపంచదేశాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో

కరోనా విషయంలో చాలా దేశాలు తప్పుదోవలో వెళ్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: ప్రజల సంరక్షణకు సంబంధించి ప్రపంచదేశాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైతే కరోనా మహమ్మారి మరింత తీవ్రతరం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే అనేక దేశాలు కరోనా మహమ్మారి విషయంలో తప్పుదారిలో వెళుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జెనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. ఇప్పటికైనా సరైన దారిలో నడవకుంటే రానున్న రోజుల్లో ఊహించని రీతికి చేరుకోవాల్సి వస్తుందని తెలిపారు. మరోపక్క ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షలకు పైగా కేసులు నమోదైనట్టు టెడ్రోస్ పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 10 దేశాల నుంచే నమోదయ్యాయన్నారు. అమెరికా, బ్రెజిల్ దేశాలు కరోనాకు కేంద్రంగా ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టెడ్రోస్ స్పందిస్తూ తమకు ఇప్పటివరకు అమెరికా నుంచి అధికారిక నోటిఫికేషన్ ఏమీ రాలేదని చెప్పారు.

Updated Date - 2020-07-14T03:46:52+05:30 IST