న్యూయార్క్‌లో తగ్గుతున్న మ‌హ‌మ్మారి ఉధృతి !

ABN , First Publish Date - 2020-06-07T13:04:42+05:30 IST

కరోనా ధాటికి విలవిల్లాడిన న్యూయార్క్‌ క్రమంగా కోలుకుంటోంది. తాజాగా అక్కడ 2,728మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

న్యూయార్క్‌లో తగ్గుతున్న మ‌హ‌మ్మారి ఉధృతి !

కరోనా తీవ్రత తగ్గుముఖం..

రష్యాలో ఒకేరోజు 197 మరణాలు

న్యూయార్క్‌/మాస్కో, జూన్‌ 6: కరోనా ధాటికి విలవిల్లాడిన న్యూయార్క్‌ క్రమంగా కోలుకుంటోంది. తాజాగా అక్కడ 2,728మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరణాలు రోజుకు 42కు తగ్గింది. కాగా, న్యూయార్క్‌లో ఇప్పటివరకూ 3,76,208మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ నెల 8 నుంచి అక్కడ దశల వారీగా ఆంక్షలు సడలించనున్నారు. రష్యాలో ఒకేరోజు 197మంది మృత్యువాతపడ్డారు. మరో 8,855 మంది కరోనా బారిన పడ్డారని టాస్క్‌ఫోర్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఆ దేశంలో కేసుల సంఖ్య 4,58,689కు చేరగా, 5,725మంది మరణించారు. సింగపూర్‌లో కొత్తగా 344 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 37,527కు పెరిగింది. రూ.1.78 లక్షల కోట్లతో రూపొందించిన నాలుగో ఉపశమన ప్యాకేజీ బిల్లును ఆదేశ పార్లమెంట్‌ శుక్రవారం ఆమోదిం చింది.


దక్షిణ కొరియాలో శనివారం 51కొత్త కేసులు నమోదయ్యాయి. సియోల్‌లో ఇంటింటికీ తిరిగి అమ్మకాలు జరిపే రిచ్‌వే సంస్థ ఉద్యోగుల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. చైనాలో శనివారం 5కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపి ఆ దేశంలో మొత్తం కేసులు 83,030కి చేరాయి. పాకిస్థాన్‌లో రికార్డు స్థాయిలో ఒకేరోజు 97 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 1,935కు పెరిగింది. ప్రపంచంలో కొవిడ్‌-19 మరణాలు 4 లక్షలు దాటాయి.

Updated Date - 2020-06-07T13:04:42+05:30 IST