మెక్సికోలో కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో!

ABN , First Publish Date - 2020-08-13T06:58:51+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతుండగా.. మెక్సికోలోనూ

మెక్సికోలో కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో!

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతుండగా.. మెక్సికోలోనూ ఈ వైరస్ విలయం సృష్టస్తోంది. మెక్సికోలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మెక్సికోలో 6వేలకుపైగా కొవిడ్-19 కేసులు నమోదవ్వగా.. సుమారు 1000 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మోక్సికోలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5లక్షలకు చేరువైంది. కరోనా కాటుకు సుమారు 54వేల మంది బలయ్యారు. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో మెక్సికో ఆరోస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడ్డ బాధితుల సంఖ్య 2కోట్లు దాటింది. ఇందులో 1.35కోట్ల మంది మహమ్మారి జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7.49లక్షలకు చేరువైంది. 


Updated Date - 2020-08-13T06:58:51+05:30 IST