మెక్సికోలో కరోనా కల్లోలం.. నిన్న ఒక్కరోజే!

ABN , First Publish Date - 2020-08-03T21:44:40+05:30 IST

కరోనా వైరస్ ఉధృతి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మెక్సికోలోనూ మమమ్మారి విజృంభణ

మెక్సికోలో కరోనా కల్లోలం.. నిన్న ఒక్కరోజే!

మెక్సికో: కరోనా వైరస్ ఉధృతి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మెక్సికోలోనూ మమమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. మెక్సికోలో నిన్న ఒక్క రోజే 9,500పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 784 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు మెక్సికోలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.34లక్షలకు చేరింది. ఇందులో 2.84లక్షల మంది కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్య 47వేలు దాటింది. ప్రస్తుతం మెక్సికోలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో మెక్సికో.. ఆరో స్థానంలో ఉంది. 


Updated Date - 2020-08-03T21:44:40+05:30 IST