యునానితో రక్షణ

ABN , First Publish Date - 2020-03-11T05:36:42+05:30 IST

కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందడం కోసం యునాని వైద్యం కొన్ని మందులను సూచిస్తోంది

యునానితో రక్షణ

కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందడం కోసం యునాని వైద్యం కొన్ని మందులను సూచిస్తోంది. అవేంటంటే...


రోజుకు రెండు సార్లు షర్బత్‌ ఉన్నబ్‌ 10 నుంచి 20 మిల్లీ లీటర్ల చొప్పున తీసుకోవాలి.


రోజుకు రెండు సార్లు తర్యక్‌ అర్బా 3 నుంచి 5 గ్రాముల చొప్పున తీసుకోవాలి.


తర్యక్‌ నజ్ల ఐదు గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.


ఖమీరా మర్వరీద్‌ మూడు నుంచి ఐదు గ్రాముల చొప్పున రోజుకు ఒకసారి తీసుకోవాలి.


రోగన్‌బదూనా లేక రోగన్‌ మామ్‌ లేదా కఫూరి బామ్‌ను ఛాతి, మాడు మీద రుద్దుకోవాలి.


అర్క్‌అజీబ్‌ నాలుగు నుంచి ఎనిమిది చుక్కలను నీళ్లలో కలిపి రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.


జ్వరంగా ఉంటే, హబ్‌ ఇ ఇక్సీబుఖార్‌ రెండు మాత్రలను గోరువెచ్చని నీటితో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.


కుర్‌స ఇ సువాల్‌ రెండు మాత్రలను రోజుకు రెండు సార్లు నమలాలి.


షర్బత్‌నజ్ల 10 మిల్లీ లీటర్లను 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.


(‘ఆయుష్‌’ సౌజన్యంతో)

Updated Date - 2020-03-11T05:36:42+05:30 IST