ఆ మహానగరంలో 100 శాతం వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-08-02T11:48:19+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు...

ఆ మహానగరంలో 100 శాతం వ్యాక్సినేషన్‌

భువనేశ్వర్: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు కోవిడ్-19 టీకా వేయించుకోవడం ఒక్కటి మాత్రమే పరిష్కారం. అందుకే దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ 100 శాతం వ్యాక్సినేషన్‌తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆలయాల నగరంగా పేరొందిన భువనేశ్వర్ ఇప్పుడు ఈ ఘనతను కూడా దక్కించుకుంది.


ఈ నగరంలో 100 శాతం మందికి టీకాలు వేయడం పూర్తయ్యింది. దీనితోపాటు నగరంలోని లక్షమంది ఎన్ఆర్ఐలకు కూడా మొదటి డోసు టీకా వేయడం జరిగింది. భువనేశ్వర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ అంశుమాన్ రథ్ మాట్లాడుతూ భువనేశ్వర్ నగరంలో 100 శాతం మందికి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. నగరంలో 18 ఏళ్ల వయసు దాటినవారు సుమారుగా 9 లక్షల 7 వేల మంది ఉన్నారని, కోవిడ్ వ్యాక్సినేషన్ గైడ్‌లైన్స్‌ను అనుసరించి వీరందరికీ జూలై 31 నాటికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్థారించారన్నారు. జూలై 30 నాటికి 18 లక్షల 35 వేల డోసుల టీకాలు వేయడం జరిగిందన్నారు. నగరంలో 55 సెంటర్లలో టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం గర్భిణులకు ప్రాధాన్యతనిస్తూ, వారికి టీకాలు వేస్తున్నారన్నారు. 

Updated Date - 2021-08-02T11:48:19+05:30 IST