కరోనాసోమ్నియా!

ABN , First Publish Date - 2021-03-30T17:11:43+05:30 IST

కరోనా మహమ్మారికి సంబంధించిన భయాందోళనతో నిద్ర సమస్యలకు గురవడాన్ని ‘కరోనాసోమ్నియా’ అంటారు. కరోనా కారక నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలంటే....

కరోనాసోమ్నియా!

ఆంధ్రజ్యోతి(30-03-2021)

కరోనా మహమ్మారికి సంబంధించిన భయాందోళనతో నిద్ర సమస్యలకు గురవడాన్ని ‘కరోనాసోమ్నియా’ అంటారు. కరోనా కారక నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలంటే....


కరోనా కారక భయాందోళనల మూలంగా 40% మంది నిద్ర సమస్యలకు లోనవుతున్నట్టు జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ స్లీప్‌ మెడిసిన్‌లో ఓ వ్యాసం ప్రచురితమైంది. కొవిడ్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడంతో పాటు కుటుంబసభ్యులకు సోకకుండా జాగ్రత్తలు పాటించడం గురించిన ఒత్తిడి కారణంగా నిద్రకు సంబంధించి సమస్యలు ఎదర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ జీవనశైలిలో మార్పులు తీసుకువచ్చింది. ఆహార, నిద్రవేళలు మారాయి. సామాజిక దూరం మూలంగా అనుబంధాలు బలహీనపడ్డాయి. మానసిక దూరాలూ పెరిగాయి. ఇంటి వాతావరణంలో ఆఫీసు పని అలవాటు లేని వ్యవహారం. ఇవన్నీ మానసిక ఒత్తిడిని పెంచేవే! వీటి కారణంగా నిద్రపట్టకపోవడం, పట్టినా తరచుగా మెలకువ కావడం, గాఢమైన నిద్రలోకి జారుకోలేకపోవడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్య తీవ్రమైతే ఆరోగ్య సమస్యలూ పెరుగుతాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకునే మార్గాలను ఆశ్రయించడం మేలంటున్నారు వైద్యులు. ఇందుకోసం...


వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఉన్నా ఆఫీసు వేళలను కచ్చితంగా పాటించాలి. ధరించే దుస్తుల మొదలు,   బ్రేక్‌ల వరకూ ఆఫీసు వాతావరణాన్ని ఇంట్లోనే తలపించేలా నడుచుకోవాలి.

బంధువులు, స్నేహితులతో తరచుగా వీడియో కాల్స్‌లో పలకరిస్తూ, బంధాలను బలపరుచుకోవాలి. 

ఒత్తిడి వదలించుకోవడం కోసం కుటుంబసభ్యులతో సరదా సమయాన్ని గడపాలి. పిల్లలతో ఆటలాడడం, కలిసి టీవీలో సినిమాలు చూడడం లాంటివి చేయాలి. లూడో, చెస్‌, క్యారమ్స్‌ లంటి ఇండోర్‌ గేమ్స్‌ కుటుంబసభ్యులతో కాలక్షేపానికి తోడ్పడతాయి.

కొత్త వంట ప్రయోగాలు చేయడం, తోటపని, ఇంటి పని లాంటివి కూడా ఒత్తిడిని దూరం చేసేవే!

కచ్చితమైన నిద్రవేళలు పాటిస్తూ, పోషకాహారం తీసుకోవడం ద్వారా కూడా ఆందోళన దరి చేరకుండా చూసుకోవచ్చు.

Updated Date - 2021-03-30T17:11:43+05:30 IST