తిరుపతి: జిల్లాలోని తిరుపతి ఐఐటీలో విద్యార్థులకు, సిబ్బందికి కొవిడ్ పాజిటీవ్‌గా నిర్థారణ అయింది. దీంతో క్యాంపస్ మొత్తాన్ని క్వారంటైన్‌గా యాజమాన్యం మార్చేసింది. పరిశోధక విద్యార్థులను తప్ప అందరినీ ఇప్పటికే ఇంటికి పంపేసింది. ప్రస్తుతం క్యాంపస్‌లో ఉన్న 214 మంది పరిశోధక విద్యార్థుల్లో 72 మందికి పాజిటివ్ అని తేలింది. 75 మంది ఫ్యాకల్టీలో 23 మందికి పాజిటీవ్ అని ఈ రోజు సాయంత్రం వచ్చిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల ఫలితాల్లో నిర్థారణ అయింది. దీంతో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి