కోరలు చాస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-10T04:39:50+05:30 IST

జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ప్రతీరోజు రెండు వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వారం వ్యవధిలోనే 1,200 లకు పైగా కేసులు నమోదయ్యాయంటే కరోనా సెకండ్‌ వేవ్‌ ఏ స్థాయిలో విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

కోరలు చాస్తున్న కరోనా
రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ వద్ద వ్యాక్సినేషన్‌ కోసం వచ్చిన ప్రజలు

జిల్లాలో విస్తృతంగా పెరుగుతున్న పాజిటివ్‌ల సంఖ్య   
తాజాగా 300 పాజిటివ్‌ కేసుల నమోదు   
జిల్లాలో కరోనా టెస్టుల సంఖ్య పెంపు       
ఆసుపత్రులకు రోగుల పరుగు   
వ్యాక్సినేషన్‌పై అధికారుల దృష్టి           
ఇప్పటి వరకు మహమ్మారి బారిన 15వేల మంది

కామారెడ్డి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ప్రతీరోజు రెండు వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వారం వ్యవధిలోనే 1,200 లకు పైగా కేసులు నమోదయ్యాయంటే కరోనా సెకండ్‌ వేవ్‌ ఏ స్థాయిలో విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం మరో 300 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఓ వైపు జిల్లా అధికార యంత్రాంగం సైతం కరోనా పరీక్షల సంఖ్య పెంచింది. ప్రస్తుతం ఉన్న పరీక్ష కేంద్రాలలోనే కాకుండా స్పెషల్‌ డ్రైవ్‌ క్రింద కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు జిల్లాలో 2000లకు పైగానే పరీక్షలు చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. సెకండ్‌ వేవ్‌లో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చిన రోగులు ఆసుపత్రులవైపు పరుగులు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,483 పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ వేగం గా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు సెకండ్‌ వేవ్‌ కరోనాపై అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడు తున్నారు.
ప్రతీరోజు 200 పైగానే కేసుల నమోదు
జిల్లాలో గత ఐదు రోజుల నుంచి చూస్తే కేసుల సంఖ్య రెండు వందలకు పైగానే నమోదవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో మొత్తం 600లకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 2,178 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో 300 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాలోని మహా రాష్ట్రకు సరిహద్దులో ఉన్న మండలాలు, గ్రామాల్లో కేసు లు ఎక్కువగా అవుతున్నట్లు తెలుస్తోంది. మద్నూర్‌ మం డలంలోని డోంగ్లీ పీహెచ్‌సీ పరిధిలో ప్రతీరోజు 50కి పైగానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధం గా బీర్కూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో సైతం 20కి పైగానే కేసులు వస్తున్నాయి. శుక్రవారం అత్యధికంగా బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పరిధిలో 34 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా కామారెడ్డిలోని రాజీవ్‌నగర్‌ అర్బ న్‌ పీహెచ్‌సీ పరిధిలో 31, దేవునిపల్లి పీహెచ్‌సీ పరిధిలో 26, బీర్కూర్‌ పీహెచ్‌సీలో 25, డోంగ్లీ పీహెచ్‌సీలో 22, పిట్లం పీహెచ్‌సీలో 20పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
టెస్టులు పెంచిన యంత్రాంగం
పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా విరుచుకుపడు తుండడంతో ఆ రాష్ట్రం నుంచి జిల్లాకు రాకపోకలు చాలా నే ఉన్నాయి. దీంతో జిల్లాలో సైతం వైరస్‌ విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై టెస్టుల సంఖ్య పెంచింది. గత ఆరు నెలలుగా ప్రతీరోజు 500 నుంచి 1000లోపే టెస్టులు చేస్తూ వచ్చారు. ప్రస్తు తం ఈ టెస్టుల సంఖ్య పెంచారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి తో పాటు రెండు ఏరియా ఆసుపత్రులు, ఐదు సీహెచ్‌ సీలు, 21 పీహెచ్‌సీలలో కరోనా పరీక్షలు చేస్తూ వస్తున్నా రు. వీటితో పాటు వైరస్‌ ఎక్కువగా ఉన్న చోట అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నారు. ఇలా జిల్లాలో ప్రతీరోజు 2వేల నుం చి 2,500 వరకు పరీక్షలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకు న్నారు. దీంతో కరోనా పాజిటివ్‌ కేసులు కూడా ఎక్కువ గానే బయటపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15,483 పాజిటివ్‌ కేసులు వచ్చా యి. ఇందులో 13,924 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 1,559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 62 మంది కరోనా భారిన పడి మృతి చెందారు.
ఆసుపత్రులకు పరుగులు
సెకండ్‌ వేవ్‌లో కరోనా ప్రమాదకరంగా మారింది. కరో నా పరీక్షలు పెరగడంతో పాజిటివ్‌ కేసులు బయటపడు తున్నాయి. కరోనా నిర్ధారణ అయిన వారు చికిత్స కోసం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కొవిడ్‌ రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో కొవిడ్‌ చికిత్స కోసం 300 వరకు బెడ్లు ఉన్నాయి. ఇందులో 11 ఆక్సిజన్‌ బెడ్లు కాగా మిగతా వి జనరల్‌ బెడ్స్‌ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 12 మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని ఎక్కువగా హోం క్వారంటైన్‌కే అధికారులు పంపుతున్నారు. సీరియస్‌ గా ఉన్నవారికి ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా మూడు క్వారంటైన్‌ కేంద్రాలను కొనసాగిస్తు న్నారు. కామారెడ్డి డివిజన్‌ పరిధిలోని భిక్కనూర్‌లో గల సౌత్‌ క్యాంపస్‌లో, ఎల్లారెడ్డి డివిజన్‌లో మాడల్‌ స్కూల్‌ లో, బాన్సువాడ డివిజన్‌లోని బోర్లాంలో క్వారంటైన్‌ కేంద్రా లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు ప్రైవేట్‌ ఆసుప త్రులలో కరోనా వైద్యానికి అనుమతి ఇచ్చారు. ఆ ఆసుప త్రులలోనూ పలువురు రోగులు వైరస్‌తో చికిత్స పొందుతు న్నారు. చాలా మంది నిజామాబాద్‌, హైదరాబాద్‌ లాంటి నగరాలలోని మల్టీస్పెషాలిటీ ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.
వ్యాక్సినేషన్‌పై దృష్టి
కరోనా కట్టడికి ఏకైక నియంత్రణ సాధనమైన వ్యాక్సినే షన్‌పై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో గత జన వరి 16నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా ప్రభుత్వ, ప్రైవే ట్‌ హెల్త్‌వర్కర్‌లు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ ఉద్యోగు లతో పాటు 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ చేయిస్తు న్నారు. 29 కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొన సాగుతో ంది. జిల్లాలో ఇప్పటి వరకు 65,646 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. గతంలో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న ప్రజలు సైతం కేసులు విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్‌ వేయించుకో వడానికి ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. మొదట్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న మున్సిపల్‌ సిబ్బంది, రెవె న్యూ సిబ్బంది అంతగా ఆసక్తి చూపకుండా అలసత్వం వహించిన వారు ఉన్నారు. గత మూడు రోజుల నుంచి ఈ రెండు విభాగాల సిబ్బంది ఆసుపత్రుల వద్ద వ్యాక్సినే షన్‌ కోసం క్యూ కట్టడం గమనార్హం. శనివారం కామారెడ్డి అర్బన్‌ పీహెచ్‌సీ వద్దకు ఏకంగా బస్సులో వ్యాక్సినేషన్‌ వేయించుకోవడానికి వచ్చారంటే వ్యాక్సిన్‌పై ప్రజలకు ఎంత నమ్మకం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-04-10T04:39:50+05:30 IST