కరోనా మనల్ని మనుషుల్ని చేస్తుంది!.. బయోకాన్ ఎండీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-03-30T01:52:38+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మానవాళికి మేలు చేస్తోందంటూ ప్రముఖ బయోఫార్మాస్యూటికల్స్ సంస్థ బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ వ్యాఖ్యానించారు.

కరోనా మనల్ని మనుషుల్ని చేస్తుంది!.. బయోకాన్ ఎండీ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మానవాళికి మేలు చేస్తోందంటూ ప్రముఖ బయోఫార్మాస్యూటికల్స్ సంస్థ బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ వ్యాఖ్యానించారు. కంటికి కనిపించని కరోనా వంటి శత్రువుతో పోరాటం మనుషులను ఏకం చేస్తోందని ఆమె అన్నారు. ఈ పరిస్థితులు మనలో అడుగంటిన మానవత్వాన్ని, వినయాన్ని తట్టిలేపి, మనల్ని మనుషులన్ని చేస్తాయని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనల్ని ఎవరూ ఓడించలేరనే అహంకారం మనుషుల్లో ఎక్కువైంది. అది మంచిది కాదు’ అని కిరణ్ వ్యాఖ్యానించారు. ’ఈ కరోనా మహమ్మారి.. మన మనసుల్లో దాగి ఉన్న మానవత్వాన్ని వెలికితీస్తుంది. మన జీవన విధానాలను మార్చేస్తుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-30T01:52:38+05:30 IST