కలవర పెడుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-02T09:47:45+05:30 IST

జిల్లాలో కరోనా అధికార యంత్రాంగంతో పాటు ప్రజలను కలవరపెడు తోంది.

కలవర పెడుతున్న కరోనా

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

అధికార యంత్రాంగంలో అంతర్మథనం

వర్షాకాలం ఆరంభంతో మరింత విజృంభిస్తుందన్న ప్రచారం

జిల్లాలో 16 ఆస్పత్రులకు కొవిడ్‌-19 ఆస్పత్రులుగా గుర్తింపు


అనంతపురం వైద్యం/అనంతపురం క్రైం/ధర్మవరం, జూన్‌ 1 : జిల్లాలో కరోనా అధికార యంత్రాంగంతో పాటు ప్రజలను కలవరపెడు తోంది. ఈ మహమ్మారి తొలిరోజులకన్నా తాజాగా విజృం భిస్తోంది. రెండు నెలల్లో నమోదైన కేసులకన్నా గత పదిరోజుల్లోనే భారీగా పెరిగాయి. ఇప్పటికే దాదాపు 320 మందికి పైగా కరోనా సోకింది. ఇందులో 300 మంది ఆరోగ్యంగా బయటపడ్డారు. మిగిలిన వారిలో ఏడుగురు మృతి చెందగా మిగతావారు ఆస్పత్రుల్లో చికిత్స పొందు తున్నారు. వీరు కాకుండా మరో 50 మంది వరకూ కరోనా పాజిటివ్‌ లక్షణాలతో వివిధ క్వారంటైన్‌లు, ఆస్పత్రుల్లో ఉంటూ చికిత్సలు పొందుతున్నారు.  కేసులు నివారణకు ఏం చేయాలో అర్థంకాక యంత్రాంగం అంతర్మథనం చెందుతోంది. దాదాపు వారం రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం కరోనా గురించి పట్టించుకోవడం మానేసిం ది. ప్రభుత్వ ఏడాది పాలన ఉత్సవాలపై దృష్టిసారిస్తూ వచ్చింది. ఇప్పుడు కరోనా కేసులు అమాంతంగా పెరుగు తుండటంతో మళ్లీ అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారిస్తున్నారు. వర్షాకాలం ఆరంభమైంది. వర్షాలు కురిస్తే.. జూన్‌, జూలై నెలలో కరోనా కేసులు మళ్లీ పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


ప్రధానంగా వర్షాకాలంలో వృద్ధులు, చిన్నపిల్లలపై కరోనా ప్రభావం అధికంగా చూపే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీరికి కరోనా సోకితే తక్షణమే తగిన వైద్యసేవలందిచకపోతే ప్రాణాలు పోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో కలెక్టర్‌ గంధం చంద్రుడు, జిల్లా వైద్యశాఖాధికారు లు, ఇతర రెవెన్యూ అధికారులు భవిష్యత్తులో కరోనా ని వారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కరోనా బాధితులకు వైద్యసేవలందించేందుకు కొవిడ్‌-19 ఆస్పత్రు లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 16 ఆస్పత్రులను అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలో వైఎస్‌ఆర్‌ ఆస్పత్రి, చంద్ర సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రి, కేర్‌ అండ్‌ క్యూర్‌, పావనీ, దివ్యశ్రీ, అమరావతి, మైత్రి, ఎస్వీ సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రి, ఆశా ఆస్పత్రులను ఎంపిక చేశారు.


గుంతకల్లులో లైఫ్‌లైన్‌, పద్మావతి ప్రైవేట్‌ ఆస్పత్రులను కొవిడ్‌ ఆస్పత్రు లుగా గుర్తించారు. ధర్మవరంలో స్పందన సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రి, రాప్తాడు సమీపంలోని ప్రజ్ఞ కేన్సర్‌ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించారు. జిల్లా సర్వజనాస్పత్రి, హిందూపురం ప్రభుత్వాస్పత్రులను కొవిడ్‌-19 ఆస్పత్రు లుగా మార్చి కరోనా బాధితులకు వైద్యసేవలందించేందు కు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది.   ఎంపికైన ఈ కొవిడ్‌-19 ఆస్పత్రుల యాజమాన్యాలతో పాటు వైద్యశాఖాధికారులతో జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చిం చారు. ఇలా జిల్లా యంత్రాంగం కరోనా నియం త్రణకు కృషి చేస్తోంది.


ప్రజాప్రతినిధి ఇంట్లో మరో ముగ్గురికి కరోనా

జిల్లాలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి కుటుంబాన్ని కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే అనారోగ్యంతో చనిపోయిన ఆ యన మేనత్తకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది.  అం త్యక్రియల్లో పాల్గొన్నవారిని గుర్తించి శాంపిళ్లు తీశారు. పలువురిని ప్రత్యేకంగా ప్రజాప్రతినిధికి చెందిన పాఠశాలలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఇప్ప టికే ఆదివారం ప్రజాప్రతినిధి తల్లితో పాటు మరో బం ధువుకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ప్రకటించారు. సోమ వారం ఆ ప్రజాప్రతినిధి కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది.


అందులో ప్రజాప్రతినిధి సోదరుడు, ఆ సోదరుడి కుమారుడు, కు మార్తె ఉన్నట్లు సమాచారం. ఈ ఐదుగురిని అధికారులు జిల్లాకేంద్రంలోని కిమ్స్‌ సవీరా కొవిడ్‌-19 ఆస్పత్రికి తర లించి చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు  ప్రజాప్రతి నిధికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని అధికా రులు చెబుతున్నారు. అయితే ఆ నేతను హోం క్వారంటైన్‌ చేసి అధికారులు, వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో సోమవారం కూడా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రచారం సాగింది. 


హెడ్‌ కానిస్టేబుల్‌కు కరోనా  

అనంతపురం నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా హెడ్‌ కానిస్టేబుల్‌ అనారోగ్యగా ఉండటంతో ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు గత నెల 31వ తేదీన ప్రభుత్వాస్ప త్రిలో కరోనా పరీక్షలు చేశారు. సోమవారం కరోనా పాజి టివ్‌ (ప్రైమరీ) నిర్ధారణ అయినట్లు తెలిసింది. దీంతో ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందిలో కలవరం మొదలైంది. హెడ్‌కానిస్టేబుల్‌ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తుండటం కీలకంగా మారింది. దీంతో మరెవరికైనా కరోనా వైరస్‌ సోకిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగులం దరికీ కరోనా పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కరోనా బారిన పడిన హెడ్‌ కానిస్టేబుల్‌ నివాసమున్న నగ రంలోని భాగ్యనగర్‌ను కూడా పోలీసులు రెడ్‌జోన్‌గా ప్రక టించి సోమవారం రాత్రి ఆ ఇంటి సమీపంలో తగు ఏర్పాట్లు చేశారు. 


 భయాందోళనలో సాయినగర్‌ వాసులు

 ధర్మవరం పట్టణంలోని సాయినగర్‌ వాసులు కరోనా దెబ్బకు కంగారెత్తిపోతున్నారు. కాలనీలో నివసించే ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల్లో ఆరుగురు కరోనా బారిన పడటంతో వారిలో ఆందోళన అధికమవుతోంది. గతనెల గుట్టకిందపల్లికి చెందిన ఓ వ్యక్తి అనం తపురంలో ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్‌ రావడంతో ముందు జాగ్రత్తగా ధర్మవరంలో ఉండే నివాసప్రాంతాన్ని కం టైన్మెంట్‌జోన్‌గా ప్రకటించారనీ, ఇక్కడ ఆరుగురు కరోనా బారిన పడినా   ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారో అర్థం కాలేదంటూ సాయినగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుని సాయినగర్‌లో రాకపోకలను నియంత్రించి కరోనా కట్టడికి కృషిచేయాలని  వారు కోరుతున్నారు.


10 మంది డిశ్చార్జ్‌

కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి నుంచి 8 మంది, స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రి నుంచి ఇద్దరిని డిశ్చార్జ్‌ చేసినట్టు ఆయన తెలి పారు. ఒక్కొక్కరికి రూ.2 వేలు అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-06-02T09:47:45+05:30 IST