కరోనా సోకిందని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-07-10T21:07:53+05:30 IST

కరోనా కన్నా.. అది సోకిందన్న రోగి బంధువుల పట్ల సాటి మనుషులు వైఖరి అమానవీయంగా ఉంటోంది. వారి ఇంటి వైపు కన్నెత్తి చూసే సాహసం ఎవరూ చేయలేకపోయినా..

కరోనా సోకిందని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు

విజయనగరం: కరోనా కన్నా.. అది సోకిందన్న రోగి బంధువుల పట్ల సాటి మనుషులు వైఖరి అమానవీయంగా ఉంటోంది. వారి ఇంటి వైపు కన్నెత్తి చూసే సాహసం ఎవరూ చేయలేకపోయినా.. రక్త సంబంధీకులందరినీ భూతంలా చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓ కుటుంబాన్ని ఏకంగా ఊరు నుండి వెలేశారు. ఊరు చివరన పశువుల పాకలో బిక్కుబిక్కుమంటు ఆ కుటుంబం జీవిస్తోంది. ఈ కుటుంబంతో నిన్న మొన్నటి వరకు కలసిమెలసి తిరిగిన తోటి గ్రామస్తులతోనే వెలేయబడింది.


హైదరాబాద్‌లో చిరుద్యోగం చేస్తున్న ఓ యువకుడు తన స్వస్ధలమైన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఈతమానువలస గ్రామం వచ్చారు. హైదరాబాద్ నుండి రావడంతో పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఇక్కడ అసలు కథ మొదలైంది. బాధితుడు కుటుంబానికి చెందిన 15మంది సభ్యులను ఊరు బయట పశువుల పాకలో ఉండమని గ్రామస్తులు, మండల స్ధాయి అధికారులు ఆదేశించారని బాధితులు కన్నీరు పెడుతున్నారు. వర్షం వచ్చినపుడు చాలా బాధపడుతున్నామని, పశువుల పాకలో కరెంటు లేక, రాత్రిళ్లు క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నామని బోరుమంటున్నారు. వంట సరుకులు అందిస్తామన్న మండల అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వీళ్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-07-10T21:07:53+05:30 IST