Abn logo
Aug 8 2020 @ 10:43AM

క‌రోనాను ఓడించిన ఉపాధ్యాయునికి ఘ‌న స్వాగ‌తం

సార‌ణ్‌: కరోనాను ఓడించి, ఇంటికి తిరిగి వ‌చ్చిన‌ ఒక ఉపాధ్యాయుడు  ఘ‌న స‌న్మానం అందుకున్నారు. ఈ  ఘ‌ట‌న బీహార్‌లోని చాప్రాలో చోటుచేసుకుంది. క‌రోనా బారిన ప‌డిన ఉపాధ్యాయుడు ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్నారు. వైద్యుల సలహాల‌ను పాటించి, కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్‌కు వ‌చ్చారు. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ స‌మ‌యంలో ఆ ప్రాంత ప్రజలు ఆయనను పూల దండ‌ల‌తో స్వాగతించారు. దీనికి ముందు ఇదే ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ వర్మ తన కారును అరుణ్ కుమార్ కోసం ఆసుప‌త్రికి పంపించారు. అరుణ్ కుమార్ ఇంటికి రాగానే స్థానికులు స్వీట్లు పంచుకున్నారు. వీరి ఆప్యాయ‌త‌ను చూసిన అరుణ్ కుమార్ ఆనందంతో భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కరోనాకు ఎవ‌రూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల‌లో క‌రోనా నివార‌ణ‌కు త‌గిన చికిత్స అందుతున్న‌ద‌ని అన్నారు. 

Advertisement
Advertisement