చిత్తూరు జిల్లాలో తగ్గని కరోనా వుధ్రుతి

ABN , First Publish Date - 2021-05-08T06:56:18+05:30 IST

జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల్లో 2260 మందికి కరోనా సోకగా అదే వ్యవధిలో ఏడుగురు మరణించినట్టు ప్రభుత్వ బులెటిన్‌ వెల్లడించింది.

చిత్తూరు జిల్లాలో తగ్గని కరోనా వుధ్రుతి
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో టెస్టింగ్‌ కిట్లు లేకపోవడంతో రెండు రోజుల తరువాత కొవిడ్‌ పరీక్షలకు రావాలని మైక్‌ ద్వారా ప్రకటిస్తున్న సిబ్బంది

తాజా కేసులు 2260 ... మరో ఏడుగురు మృత్యువాత


తిరుపతి, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల్లో 2260 మందికి కరోనా సోకగా అదే వ్యవధిలో ఏడుగురు మరణించినట్టు ప్రభుత్వ బులెటిన్‌ వెల్లడించింది. తాజా కేసులు, మరణాలతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 136499కు చేరుకోగా మరణాలు 1016కు చేరాయి. కాగా శుక్రవారం ఉదయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ల సంఖ్య 20960కి చేరింది. కొత్తగా గుర్తించిన కేసులు తిరుపతి నగరంలో 447, తిరుపతి రూరల్‌లో 193, మదనపల్లెలో 102, చిత్తూరులో 89, పుంగనూరులో 85, బంగారుపాలెంలో 82, చంద్రగిరిలో 81, పలమనేరులో 72, కుప్పంలో 71, ఏర్పేడులో 65, వాల్మీకిపురంలో 53, పీలేరులో 48, ఎర్రావారిపాలెంలో 47, రామకుప్పంలో 43, పుత్తూరు, తంబళ్ళపల్లెల్లో 42 వంతున, రేణిగుంటలో 41, గంగవరంలో 37, శాంతిపురంలో 36, కేవీపల్లెలో 31, బైరెడ్డిపల్లెలో 30, తవణంపల్లెలో 27, పెద్దపంజాణిలో 26, ములకలచెరువులో 25, కార్వేటినగరం,రొంపిచెర్ల, శ్రీకాళహస్తిల్లో 24 చొప్పున చిన్నగొట్టిగల్లు, కలికిరిల్లో 23 వంతున, నగరి, పాకాల, పులిచెర్ల మండలాల్లో 20 చొప్పున, వెదురుకుప్పంలో 18, పీటీఎంలో 17, సోమల, శ్రీరంగరాజపురం మండలాల్లో 16 వంతున, జీడీనెల్లూరు, గుడుపల్లె మండలాల్లో 15 వంతున, కలకడ, సదుం మండలాల్లో 14 చొప్పున, బి.కొత్తకోట, వడమాలపేట మండలాల్లో 12 వంతున, బీఎన్‌ కండ్రిగ, వి.కోట మండలాల్లో 10 చొప్పున, సత్యవేడులో 9, గుడిపాల, పాలసముద్రం మండలాల్లో 8 వంతున, రామచంద్రాపురం, రామసముద్రం, తొట్టంబేడు మండలాల్లో 7 చొప్పున, గుర్రంకొండ, పెద్దమండ్యం, పూతలపట్టు మండలాల్లో 6 వంతున, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో 5 చొప్పున, ఐరాల, కురబలకోటల్లో 4 వంతున, కేవీబీపురం, నిమ్మనపల్లె, విజయపురం మండలాల్లో 3 వంతున, చౌడేపల్లె, పెనుమూరుల్లో 2 వంతున, నారాయణవనం, వరదయ్యపాలెం, యాదమరి మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


చికిత్స కోసం వెళ్ళి ఆస్పత్రిలో ఇద్దరి మృతి


చౌడేపల్లె మండలం వెంగళ్ళపల్లెకు చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ (70)కు శుక్రవారం శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో కుటుంబీకులు చౌడేపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. వైద్యాధికారి ర్యాపిడ్‌ టెస్టు చేయగా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ప్రాధమిక చికిత్సకు ఉపక్రమించేలోపే ఆమె మరణించారు. పీటీఎం మండలం కొండయ్యగారిపల్లెకు చెందిన 65 ఏళ్ళ వృద్ధుడు కొవిడ్‌తో చికిత్స కోసం శుక్రవారం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అయితే బెడ్ల కొరతతో అడ్మిషన్‌ దొరకలేదు. నిరీక్షిస్తూ ఆవరణలోనే వృద్ధుడు మృతి చెందారు.


మదనపల్లె ఆస్పత్రిలో 15మందికి పాజిటివ్‌


 మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 15మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఏడుగురు డాక్టర్లు, ఎనిమిదిమంది నర్సులున్నారు. దీంతో మిగతా సిబ్బంది విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారు

Updated Date - 2021-05-08T06:56:18+05:30 IST