Abn logo
Jul 9 2020 @ 21:31PM

కరోనా చికిత్సకు డ్రోన్‌

హైరిస్క్ కరోనా వార్డుల్లో చికిత్సకు కొత్త సదుపాయాన్ని కనుగొన్నారు. మెడి-సారథి పేరిట డ్రోన్‌, ట్రాలీకి పంజాబ్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు.  వైద్యులకు, మెడికల్‌ సిబ్బందికి ఉపయోగపడేలా తయారు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో రూపకల్పన చేశారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ వైద్యులతో పాటు రోపర్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. భౌతికదూరం పాటిస్తూ రోగులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. పూర్తిస్థాయిలో ఈ డ్రోన్‌ రిమోట్‌తో పనిలా తయారు చేశారు. అంతేకాదు డ్రోన్‌లో కెమెరాలు అమర్చారు. పేషెంట్ల టెంపరేచర్‌‌ను కూడా ఈ డ్రోన్ రికార్డ్‌ చేస్తుంది. మందులు, శానిటైజర్లను రోగుల వద్దకు తీసుకెళ్లే సామర్థ్యంతో పాటు భోజనం కూడా తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంటుంది. 

Advertisement
Advertisement