కరోనా లక్షణాలు లేకపోయినా వైరస్‌ ఉండే అవకాశం: మంత్రి ఈటల

ABN , First Publish Date - 2020-04-10T01:18:20+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారని ఏబీఎన్‌తో మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

కరోనా లక్షణాలు లేకపోయినా వైరస్‌ ఉండే అవకాశం: మంత్రి ఈటల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారని ఏబీఎన్‌తో మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో 1089 మంది మర్కజ్‌కి వెళ్లొచ్చారని, అందరికంటే ముందుగా లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ అని ఈటల తెలిపారు. శుక్రవారం నుంచి తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గే అవకాశం ఉందన్నారు. వందల కోట్లు పెట్టి మందులు, పీపీఈ కిట్లకు ఆర్డర్‌ ఇచ్చామని, 15 రోజుల్లో గచ్చిబౌలిలో 1500 పడకలు సిద్ధం చేశామని ఈటల పేర్కొన్నారు. 22 మెడికల్‌ కాలేజీలను కూడా సిద్ధంగా ఉంచామని, సంకల్పబలం ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. సకాలంలో చికిత్స తీసుకోకపోవడం వల్లే 12 మంది మృతిచెందారని, కొన్ని సందర్భాల్లో కరోనా లక్షణాలు లేకపోయినా వైరస్‌ ఉండే అవకాశం ఉందని మంత్రి ఈటల అన్నారు.

Updated Date - 2020-04-10T01:18:20+05:30 IST