Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘కొద్దిగా’ ఉన్నా పెద్ద ప్రమాదమే..!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ స్వభావం, వ్యాప్తికి సంబంధించి వైద్య నిపుణులు పలురకాలుగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కరోనా సోకిన 80 శాతం మందిలో మొదట్లో అత్యంత స్వల్పంగా మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడొచ్చు. వాస్తవానికి కరోనా విషయంలో ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ. వ్యాధి లక్షణాలు బయటపడి తెలుసుకొనేలోపే ఒకరి నుంచి చాలామందికి వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో వైరస్‌ ఉన్నా లక్షణాలు బయటపడే సరికి సమయం పట్టొచ్చు. మరికొంత మందిలో జలుబు, చిరాగ్గా అనిపించడం, వాసన, రుచి కోల్పోవడం లాంటి లక్షణాలు స్వల్పంగా ఉండొచ్చు. ఇంటిదగ్గరే మందులేసుకుంటే పోతుందిలే అనే భావన చాలామందిలో ఏర్పడుతుంది.


కొద్దిపాటి జబ్బు లక్షణాలతో ఆఫీసులకు వెళ్తేవారు కూడా ఉంటారు. కానీ ఈ లక్షణాలు ఎక్కడికి దారితీస్తాయనేది వెంటనే తెలియదు, తెలిసేలోగా ప్రమాదం జరిగి ఉం డొచ్చు. పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్కో వ్యక్తి వల్ల సగటున మరో ముగ్గురు కరోనా బారినపడే ప్రమాదం ఉంది. అలా వైరస్‌ సోకినవారిలో అంతగా వ్యాధి నిరోధక శక్తి లేనివారు, ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడేవారు ఉండొచ్చు. అలాంటి వారి విషయంలో కరోనా వైరస్‌ ప్రాణాలు తీసేటంత ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల వ్యాధి లక్షణాలు అసలు లేకపోయినా, స్వల్పంగా ఉన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...