87వేల మంది పారిశుధ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2020-04-10T06:25:42+05:30 IST

కరోనా వైరస్‌ నివారణకు కృషి చేస్తున్న దాదాపు 87 వేల మంది పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మునిసిపాలిటీలు...

87వేల మంది పారిశుధ్య సిబ్బందికి  ప్రోత్సాహకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నివారణకు కృషి చేస్తున్న దాదాపు 87 వేల మంది పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పని చేసే  రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ  ఇస్తుంది.  ఇందు కోసం రూ.50 కోట్లకు పైగా సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ పరిఽధిలోని  సిబ్బందికి రూ.7,500, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల సిబ్బందికి రూ.5 వేలు అందిస్తుంది. మార్చి నెలలో విధులకు హాజరైన వారికి మాత్రమే ఈ నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది. మునిసిపల్‌ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న రెగ్యులర్‌ సిబ్బందికి వారి వేతనంపై 10 శాతాన్ని ప్రోత్సాహకంగా అందిస్తుంది. 

Updated Date - 2020-04-10T06:25:42+05:30 IST