నేటి నుంచి రేషన్‌కార్డుదారులకు రూ. వెయ్యి పంపిణీ

ABN , First Publish Date - 2020-04-04T10:16:29+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యం లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ్లరేషన్‌కార్డుదా రులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు రూ. 1000లు శనివారం పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.

నేటి నుంచి రేషన్‌కార్డుదారులకు రూ. వెయ్యి పంపిణీ

జన్‌ధన్‌ ఖాతా ఉన్న మహిళలకు రూ. 500 జమ

మహిళాసంఘాలకు రుణ పరిమితి రూ. 20 లక్షలకు పెంపు

పీఎం కిసాన్‌ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమ

ఉపాధి కూలి రూ. 231లకు పెంపు

జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం,ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యం లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న  ్లరేషన్‌కార్డుదా రులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు రూ. 1000లు శనివారం పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. వలంటీర్లే ఇళ్ల వద్దకు వచ్చి నగదు పంపిణీ చేస్తా రన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ. 1000 చొప్పున అందించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలోని 10,67,986 లక్షల తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ. 106.79 కోట్లకు పైబడి పంపిణీ చేస్తా మన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ యోజన కింద జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ. 500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు.


మహిళలు ఒకేసారి అందరూ ఆ మొత్తాన్ని డ్రా చేసుకునేం దుకు వెళ్ల కుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాతా నెంబర్‌లో చివర్లో 0,1 అంకెలున్న వారు ఇప్పటికే డ్రా చేసుకున్నారన్నారు. 2,3 అంకెలున్న వారు 4వ తేదీన, 4,5 అంకెలున్న వారు 7వ తేదీన, 6,7 అంకెలున్న వారు 8వ తేదీన, 8,9 అంకెలున్న వారు 9వ తేదీన డ్రా చేసుకోవా లన్నారు. పీఎం కిసాన్‌ యోజన కింద రూ. 2 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారన్నారు. స్వ యం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందించే రుణ సహాయాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచినట్టు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతమిస్తున్న కూలీ రూ. 211 నుంచి రూ. 231లకు పెంచి నట్టు వివరించారు. ఈ మొత్తాలన్నింటిని సకాలంలో లబ్ధిదా రులకు చేర్చేలా బ్యాంకర్లను ఆదేశించామన్నారు. అందుకు సంబంధించి ఏటీఎంలలో తగినన్ని నగదు నిల్వలు ఉంచాలని  సూచించామన్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ నివారణ చర్యలు పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.


జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకూ మొత్తం 190 శాంపిల్స్‌లలో 164 శాంపిల్స్‌ నెగిటివ్‌ వచ్చాయన్నారు. రెండు శాంపిల్స్‌ మాత్రమే పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. మరో 24 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 24 మందిని క్వారం టైన్‌లో ఉంచామన్నారు. వారితో కాం టాక్ట్‌ అయిన వారు 209 మంది ఉన్నారన్నారు. జిల్లాలో ఉన్న నిరాశ్రయులేగాక వివిధ ప్రాంతాల నుంచి పొట్ట కూటి కోసం జిల్లాకొచ్చిన వారందరికి ఆశ్రయంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఒకే ప్రాంతంలో హోంక్వారంటైన్‌లో  ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే ఆ ప్రాంతాలను హాట్‌ స్పాట్‌గా గుర్తించామ న్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎన్‌పీకుంట మండలం మర్రి కొమ్మదిన్నె, ముదిగుబ్బ, అనంత పురం రూరల్‌లోని పాపంపేట, తాడిపత్రి, తలుపుల, రాప్తాడు లోని ప్రసన్నాయపల్లి హాట్‌స్పాట్‌లుగా గుర్తించామన్నారు. అనంతపురం పట్టణంలో 16 ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించామన్నారు. అందులో 9,53,5141,70,12,42,50,68, 45,67,72,46,48,25,23 సెక్రెటరీ వార్డులు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టామన్నారు. అంతేకాకుండా శాంపిల్‌ కలెక్షన్‌ చేసేందుకు మూడు మొబైల్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా 109 శాంపిల్స్‌ సేకరించామన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌, పీఎం కేర్‌ సహా య నిధులకు సంబంధించి రూ. 8.5 లక్షలు చెక్కుల రూపం లో వచ్చాయన్నారు. వీటితో పాటు వస్తురూపంలో కూడా దాతలు సహాయం చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, ఎల్‌డీఎం మోహన్‌మురళీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:16:29+05:30 IST