కరోనా లాక్‌డౌన్ అమలుకు డ్రోన్లతో పోలీసుల నిఘా

ABN , First Publish Date - 2020-03-26T17:57:27+05:30 IST

దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ముంబై నగరంలో దీన్ని అమలుచేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.....

కరోనా లాక్‌డౌన్ అమలుకు డ్రోన్లతో పోలీసుల నిఘా

ముంబై : దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ముంబై నగరంలో దీన్ని అమలుచేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ముంబై వీధుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు కోరుతూ ప్రచారం చేయడంతో పాటు ఎవరూ బయటకు రాకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. ‘‘సోదర, సోదరీమణులారా, నగరంలో ఏప్రిల్ 14వతేదీ వరకు కర్ఫ్యూ విధించాం..ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు, కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇళ్లలోనుంచి బయటకు రాకుండా ఉండటం ఒక్కటే పరిష్కారం, ఎలాంటి కారణం లేకుండా ఎవరైనా ఇళ్లలోనుంచి బయటకు వస్తే వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు పెడతాం’’ అని ముంబై పోలీసులు హెచ్చరించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-03-26T17:57:27+05:30 IST