తెలంగాణలో ఇవాళ ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..

ABN , First Publish Date - 2020-04-01T02:11:39+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేంద్ ప్రకటించారు.

తెలంగాణలో ఇవాళ ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేంద్ ప్రకటించారు. మర్కజ్‌ నుంచి వచ్చిన వారికి.. వారి బంధువులకు 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంత్రి ఈటల తెలిపారు. ఆస్పత్రిలో 77 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని ఈటల అన్నారు. మర్కజ్‌ నుంచి వచ్చిన వారందరూ.. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ఈటల స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు.. వారి బంధువులను కూడా పరీక్షలకు తీసుకురావాలని మంత్రి ఈటల చెప్పారు. డయాలసిస్‌, తలసేమియా, సికెల్‌ సెల్‌ ఉన్నవారిని ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశించారని ఈటల తెలిపారు. గర్భిణులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఈటల అన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి ఈటల పేర్కొన్నారు.

Updated Date - 2020-04-01T02:11:39+05:30 IST