15 రోజుల్లో ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల‌కు కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-06-03T17:37:29+05:30 IST

దేశంలో కరోనా బాధితుల‌ సంఖ్య రెండు లక్షలు దాటింది. కేవలం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే బాధితుల‌ సంఖ్య లక్ష నుండి రెండు లక్షలకు పెరగ‌డం గ‌మ‌నార్హం.‌ అయితే కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ...

15 రోజుల్లో ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల‌కు కరోనా కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల‌ సంఖ్య రెండు లక్షలు దాటింది. కేవలం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే బాధితుల‌ సంఖ్య లక్ష నుండి రెండు లక్షలకు పెరగ‌డం గ‌మ‌నార్హం.‌ అయితే కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ, ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుగుతుండ‌టం విశేషం. గ‌తంలో అంటే మే 19న ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గ‌ణాంకాల‌ ప్రకారం అప్ప‌టికి దేశంలో కరోనా రోగుల సంఖ్య ఒక లక్షా ఒక వేయి 139. వీరిలో 3163 మంది మృతి చెందారు. 15 రోజుల తరువాత ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. దేశంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింప‌య్యాయి. ఈ రోజు ఉదయం ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో మొత్తం క‌రోనా రోగుల సంఖ్య 2 లక్షల 7 వేల 615. ఇందులో 5 వేల 815 మంది మృతి చెందారు. సుమారు 50 శాతం మంది అంటే ఒక‌ లక్ష 303 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.  ఇది ఉప‌శ‌మ‌నం కలిగించే అంశంగా మారింది. 

Updated Date - 2020-06-03T17:37:29+05:30 IST