బంధువులు రాలేని దుస్థితి ... అంత్యక్రియలు చేసిన ముస్లింలు

ABN , First Publish Date - 2020-03-30T12:23:39+05:30 IST

కరోనా వైరస్‌పై యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుండగా, దీనికి సంబంధించిన భయం ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా ఇన్ఫెక్షన్ భయం నెలకొన్న నేపథ్యంలో ఎవరు చనిపోయినా...

బంధువులు రాలేని దుస్థితి ... అంత్యక్రియలు చేసిన ముస్లింలు

బులంద్‌షహర్ : కరోనా వైరస్‌పై యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుండగా, దీనికి సంబంధించిన భయం ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా ఇన్ఫెక్షన్ భయం నెలకొన్న నేపథ్యంలో ఎవరు చనిపోయినా బంధువులు రావడం లేదు. అలాంటి ఒక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లో చోటుచేసుకుంది. హిందూ, ముస్లింల ఐక్యతకు ఇది ఒక ఉదాహరణ అని పలువురు అంటున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు రవి శంకర్. ఆయన  క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశాడు. అయితే అతని అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేని పరిస్థితి  నెలకొంది. విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం సోదరులు రామ్ నామ్ సత్య హై అంటూ రవిశంకర్ కు హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా మృతుని కుమారుడు మాట్లాడుతూ తనకు ఎదురైన కష్టకాలంలో  ముస్లింలు ఆదుకుని, అండగా నిలిచారన్నారు. 


Updated Date - 2020-03-30T12:23:39+05:30 IST