హైదరాబాద్‌లో రోడ్డుపై ఉమ్మినందుకు యువకుడిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-11T03:32:33+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

హైదరాబాద్‌లో రోడ్డుపై ఉమ్మినందుకు యువకుడిపై కేసు నమోదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతున్నప్పటికీ కొంత మంది అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్, సబ్బుతో ప్రతి గంటకు చేతులు శుభ్రం చేసుకోవాలని సర్కారు సూచించింది. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా హయత్‌నగర్‌లో రోడ్డుపై ఉమ్మినందుకు అబ్దుల్ ముజేద్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు, వాహనంపై ఉమ్మి పోలీసులకు ముజేద్ అడ్డంగా దొరికిపోయాడు. హయత్‌నగర్ చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్ ముజేద్‌పై సెక్షన్ 274, 269 ఐపీసీ కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-04-11T03:32:33+05:30 IST