Abn logo
May 13 2021 @ 15:18PM

నీటి ద్వారా కరోనా.. నిజమెంత?

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు గంగా, యమునా నదుల్లో కొట్టుకొస్తుండడం పరివాహక ప్రాంతాల ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఆ నదుల నీరు తాగుతున్న వారికి కూడా కరోనా సోకుతుందనే ప్రచారం జోరందుకుంది. అయితే నీటి ద్వారా కరోనా సోకుతుందనే విషయంలో ఇప్పటివరకు సమగ్రమైన సమాచారం లేదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. 


ఐఐటీ-కాన్పూర్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త సతీష్ టారే ఈ విషయంపై తాజాగా స్పందించారు. `కరోనా మృతదేహాలను నదుల్లో పడేస్తుండడం వల్ల ఆ నీటిని తాగే వారికి కూడా కరోనా వస్తుందనే భయాలు అక్కర్లేదు. నదులలోని నీటిని శుద్ధి చేసిన తర్వాతే తాగునీరుగా పంపిణీ చేస్తారు. శుద్ధీకరణ ప్రక్రియలో వైరస్ చనిపోతుంది. అయితే నదుల నుంచి నీటిని నేరుగా తీసుకుని తాగే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల`ని సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement