యమకింకరులను ఉసిగొల్పిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-04-09T01:55:21+05:30 IST

తణుకు నియోజకవర్గంలో కరోనా వైరస్ నేపథ్యంలో జనాలు దూరం పాటించేలా.. అనవసరంగా బయటకు రాకుండా ఉండేలా..

యమకింకరులను ఉసిగొల్పిన ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి: తణుకు నియోజకవర్గంలో కరోనా వైరస్ నేపథ్యంలో జనాలు దూరం పాటించేలా.. అనవసరంగా బయటకు రాకుండా ఉండేలా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. జాతరలో బేతాళుడు, యమకింకరుల వేషాలు వేసే వారిని పిలిపించి.. జనాలను బయటకు రావొద్దని.. లాక్ డౌన్ పాటించాలని వేడుకుంటున్నప్పటికీ ఇంకా కొంతమంది పని లేకపోయినా బయటకు వస్తూనే ఉన్నారు. అయితే వారిలో మరింత అవగాహన కల్పించడానికి ఎమ్మెల్యే వినూత్నంగా ఆలోచించారు. నియోజకవర్గంలో బేతాళ, యమకింకరుల వేషగాళ్లను తిప్పుతూ అవగాహన కల్పించారు. ఎవరైనా దగ్గరగా ఉన్నా చిన్న పిల్లలను బయటకు తీసుకొచ్చినా వారిని బయపెడుతూ అవగాహన కల్పించారు.  

Updated Date - 2020-04-09T01:55:21+05:30 IST