వైరస్‌ కబురు చల్లగా...

ABN , First Publish Date - 2020-03-12T23:20:00+05:30 IST

వైరస్‌ అనగానే - నిన్న మొన్నటివరకూ ఏదో కంప్యూటర్‌ వైరస్‌ అన్నట్టు ఆ పదాన్ని పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు జనం.

వైరస్‌ కబురు చల్లగా...

వైరస్‌ అనగానే - నిన్న మొన్నటివరకూ ఏదో కంప్యూటర్‌ వైరస్‌ అన్నట్టు ఆ పదాన్ని పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు జనం. కానీ ఇప్పుడా పేరెత్తగానే - కరోనా గురించేనా అంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న టెన్షన్లకి తోడు - సైంటిస్టులు మరో వైరస్‌ కబురు చల్లగా చెప్పారు.


కాలే పెట్టలేనంత చల్లని వాతావరణంలో జీవజాలం ఎలా బతికి బట్టకడుతుంది? అనే విషయమ్మీద సైంటిస్టులు ఓ ప్రయోగం చేసినప్పుడు - ఉత్తరమంచుఖండంలో క్లమిడియా అనే బ్యాక్టీరియా బయటపడిందట. క్లమిడియే అనే తరగతికి చెందిన ఈ బ్యాక్టీరియాని సైంటిస్టులు సరిగ్గా ఎక్కడ కనుగొన్నారో తెలుసా? ఆర్క్‌టిక్‌ మంచులో మూడు కిలోమీటర్ల లోతున! దీంట్లో ఒక రకం బ్యాక్టీరియా మనుషుల మీద కూడా ప్రభావం చూపించగలవట.


అసలే కరోనాతో దాని అదుపు చేసే పనులతో కంగారుపడి చస్తుంటే - ఎక్కడో మంచు ప్రాంతాల్లోంచి రోగాల్ని తవ్వి కూడా తీయడం ఎందుకురా బాబూ? - అని కామెంట్‌ చేయకండి!  ఈ బ్యాక్టీరియా మీద తగినన్ని పరిశోధనలు చేస్తే సూక్ష్మజీవులు మనుషుల మీద ఎలా ప్రభావం కలగజేస్తాయన్న రహస్యాలు బయటపడతాయట. చూద్దాం! చివరికి మంచికే అయితే అంతా మంచిదే!


Updated Date - 2020-03-12T23:20:00+05:30 IST