కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు

ABN , First Publish Date - 2020-06-05T22:39:22+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్‌పై పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి.

కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్‌పై పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. శాస్త్రవేత్తల బృందం చేస్తున్న పరిశోధనల్లో ఆందోళనకర నిజాలు వెలుగులోకి వస్తుండటం మరింత భయం గొల్పుతోంది. యువతకు కరోనా వైరస్ సోకితే.. లక్షణాలు ఉన్నా... లేకున్నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. కరోనాపై అమెరికాకు చెందిన థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఈ అధ్యయనం జరిపింది. మార్చి 20 - ఏప్రిల్ 10 మధ్య జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని పరిధోకులు తెలిపారు. 


అసాధారణ స్థితిలో స్ట్రోక్స్ ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా 70, 80లలో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్స్ 30, 40, 50లలో వస్తున్నాయని తెలిపారు. ఎన్‌వైయూ లాన్‌గోన్ మెడికల్ సెంటర్ సర్జన్లు కూడా తమ పరిశోధనల్లో పాలుపంచుకున్నారని పరిశోధనలకు అధ్యక్షత వహించిన పాస్కల్ జాబర్ చెప్పారు. 

Updated Date - 2020-06-05T22:39:22+05:30 IST