‘అమితాబ్, అభిషేక్ త్వరగా కోలుకోవాలి’
ABN , First Publish Date - 2020-07-13T09:11:50+05:30 IST
కరోనా వైరస్ సోకి ఆస్పత్రి పాలైన బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు ...
ముంబై: కరోనా వైరస్ సోకి ఆస్పత్రి పాలైన బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు ట్విటర్‌లో సందేశాలు పోస్ట్ చేశారు. ‘టేక్ కేర్...అమిత్ జీ’... ‘మీరు, అభిషేక్ త్వరగా కోలుకోవాలని, మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సచిన్ ట్వీట్ చేశాడు. ‘సార్ (అమితాబ్) మీరు వేగంగా కోలుకోవాలి’ అని హర్భజన్, ‘సోదరా (అభిషేక్) నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని యువరాజ్ ట్వీట్ చేశారు.