మటన్ కొట్టు వ్యాపారికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-14T22:27:11+05:30 IST

ఉయ్యూరు పమిడిముక్కల మండలం మంటాడలో మటన్ కొట్టు వ్యాపారికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.

మటన్ కొట్టు వ్యాపారికి కరోనా పాజిటివ్

కృష్ణా: ఉయ్యూరు పమిడిముక్కల మండలం మంటాడలో మటన్ కొట్టు వ్యాపారికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఆ వ్యాపారి ఉయ్యూరులోనే నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఆదివారం మటన్ అమ్మకాలు సాగించినట్లు సమాచారం. కొనుగోలుదారుల వివరాలు తెలియక అధికారులు. మల్లగుల్లాలు పడుతున్నారు. ఉయ్యూరులో సైతం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆ గ్రామ వాసులు భయాందోళనలు చెందుతున్నారు.

Updated Date - 2020-07-14T22:27:11+05:30 IST