రోబోట్‌ క్లీనర్స్‌

ABN , First Publish Date - 2020-04-16T17:08:54+05:30 IST

రోబోట్‌ క్లీనర్స్‌

రోబోట్‌ క్లీనర్స్‌

సింగపూర్‌: కరోనా వైరస్‌ విసురుతున్న సవాళ్ళకు శాస్త్రవేత్తలు తమదైన పద్ధతుల్లో సమాధానం చెబుతున్నారు. ఉపరితలాలపై ఉన్న వైర్‌సను అతి తక్కువ రిస్క్‌తో శుభ్రపరిచేందుకు రోబోట్లను సింగపూర్‌లోని నన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధిపర్చారు. వీటికి ఎక్స్‌ట్రీమ్‌ డిస్‌ఇన్ఫెక్షన్‌ రోబోట్‌ అని పేరుపెట్టారు. ఇవి పాక్షిక స్వతంత్రతను కలిగి ఉంటాయి. లాప్‌టాప్‌ లేదంటే టాబ్లెట్‌ సహాయంతో వీటిని నియంత్రించవచ్చు. మార్కెట్లో ఉన్న క్లీనర్లతో పోల్చుకుంటే వీటి పనితీరులో తేడా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న రోబోలు సాఫీగా ఉండే ఉపరితలాలు అంటే ఫ్లోర్‌ వంటి వాటిని మాత్రమే శుభ్రపర్చగలవు. వేర్వేరు ఆకారాలు ఉన్న చోట పనిచేయలేవు. అయితే ఈ కొత్త రోబోలకు ఆరు చేతులు ఉంటాయి. దాంతో బెడ్స్‌, టేబుల్‌ కింది భాగంలో అలాగే తలుపులకు ఉండే గడియలు వాటిపైన, టేబుల్‌ టాప్స్‌, లైట్‌ స్విచ్‌లను కూడా శుభ్రం చేస్తాయి.  వస్తువు ఉపరితలమే కాదు, కనిపించని భాగాలను సైతం అవి శుభ్రపర్చగలవు. రసాయనాలను కూడా వీటితో ఉపయోగించవచ్చు. ముప్పయ్‌ నుంచి యాభై మీటర్ల దూరం నుంచి వీటిని ఆపరేట్‌ చేయవచ్చు.

Updated Date - 2020-04-16T17:08:54+05:30 IST