కొత్త ఖైదీల కోసం 37 ప్రత్యేక జైళ్లు

ABN , First Publish Date - 2020-04-05T14:01:24+05:30 IST

కొత్త ఖైదీల కోసం 37 ప్రత్యేక జైళ్లు

కొత్త ఖైదీల కోసం 37 ప్రత్యేక జైళ్లు

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేలా కొత్త ఖైదీలను ఉంచేందుకు 37 ప్రత్యేక జైళ్లను జైళ్ల శాఖ ఏర్పాటు చేసింది. ఈ వ్యాధిని అడ్డు కునేందుకు జైళ్ల శాఖ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా చిన్న నేరాలకు పాల్పడిన నేరస్తులను బెయిలుపై విడుదల చేస్తున్నారు. ఆ ప్రకారం ఇప్పటి వరకు 4 వేల మందికి పైగా ఖైదీలను విడుదల చేసినట్టు జైళ్ల శాఖ వర్గాలు తెలి పాయి. కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలను పాత ఖైదీలతో చేర్చకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో ఖైదీలను కలుసుకొనేందుకు కుటుంబసభ్యులు, బంధువు లను నిరాకరిస్తున్నారు. కానీ కొన్ని నిబంధనలతో న్యాయవాదులను మాత్రం అను మతిస్తున్నారు. ఖైదీల ద్వారా జైళ్లలో కరోనా వ్యాపించకుండా ఉండేలా 37 ప్రత్యేక జైళ్లను ఏర్పాటుచేశారు. 9 సెంట్రల్‌ జైళ్లు, 9 జిల్లా జైళ్లు, 95 సబ్‌ జైళ్లు, 4 మహిళల ప్రత్యేక జైళ్లలో 37 జైళ్లను జిల్లాలవారీగా ఎంపిక చేసి వాటిని శుభ్రం చేసి, క్రిమినా శిని మందులను పిచికారి చేసి కొత్త ఖైదీలను అనుమతించారు. ఈ 37 ప్రత్యేక జైళ్లలో 5 వేల మంది ఖైదీలను ఉంచే అవకాశముందని జైళ్ల అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-05T14:01:24+05:30 IST