మిమ్స్‌ను సందర్శించిన ఉపముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-04-04T11:13:56+05:30 IST

మిమ్స్‌ను సందర్శించిన ఉపముఖ్యమంత్రి

మిమ్స్‌ను సందర్శించిన ఉపముఖ్యమంత్రి

నెల్లిమర్ల: కోవిడ్‌-19 ఆసుపత్రిగా ఎంపిక చేసిన మిమ్స్‌ ఆసుపత్రిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో వార్డుల సంఖ్య, పడకలు, ఐసీయూ విభాగం, మందులు తదితర వివరాలను వైద్యులను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ కారణంగా ఎలాంటి తీవ్ర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వైద్యులు, అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఆమె వెంట వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు, జేసీ-2 కూర్మనాథ్‌, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, మిమ్స్‌ ప్రధాన వైద్యాధికారి సుబ్ర హ్మణ్య హరికిషన్‌, మిమ్స్‌ చైర్మన్‌ అల్లూరి మూర్తిరాజు, ప్రిన్సిపాల్‌ లక్ష్మీ కుమార్‌, సూపరింటెండెంట్‌ రఘురామ్‌, ఆర్‌ఎంవో వర్మరాజు, పీఆర్‌వో గిరి రాజు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. 


అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

విజయనగరం: రైతు బజార్‌లో కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్య మంత్రి  పుష్పశ్రీవాణి  హెచ్చరించారు. పట్టణంలోని రాజీవ్‌ క్రీడా మైదానంలో  కూరగాయల మార్కె ట్‌ను శుక్రవారం సందర్శించారు. రైతులతో పాటు అక్కడకు కొనుగోలుకు వచ్చిన వినియోగదారులకు మాస్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T11:13:56+05:30 IST