Advertisement
Advertisement
Abn logo
Advertisement

సాగరతీరం విశాఖలో కరోనా కల్లోలం

విశాఖ: నగరంలో కరోనా కల్లోలం రేపుతోంది. స్కూల్ విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. గోపాలపట్నం, ఎల్లపువానిపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటీవ్ అని తేలింది. ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి, సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు స్కూల్ ప్రాంగణం, విద్యార్థుల ఇళ్లవద్ద శానిటేషన్ చేయించారు.

Advertisement
Advertisement