భారత్‌లో కనిపించిన కరోనా వేరియంట్‌పై ఆందోళన: యూకే ప్రధాని

ABN , First Publish Date - 2021-05-14T04:06:33+05:30 IST

భారత్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా సంక్షోభానికి కారణమైన వైరస్ వేరియంట్‌పై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో కనిపించిన కరోనా వేరియంట్‌పై ఆందోళన: యూకే ప్రధాని

లండన్: భారత్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా సంక్షోభానికి కారణమైన వైరస్ వేరియంట్‌పై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో తొలిసారి కనిపించిన ఈ వైరస్ వేరియంట్ యూకేలో విజృంభిస్తుందేమో అని తాను ఆందోళన చెందుతున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. ‘‘ఈ వేరియంట్ ఆందోళనకరం. మేం కూడా దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాం’’ అని జాన్సన్ వెల్లడించారు. ఇంతకాలం లాక్‌డౌన్‌లో ఉన్న బ్రిటన్‌లో తాజాగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది.


అయితే ఈ మధ్య కాలంలో యూకేలో కూడా భారత్‌లో విజృంభిస్తున్న బి.1.617 వేరియంట్ కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ ఈ వేరియంట్ తమ దేశంలో విజృంభిస్తుందేమో అని ఆందోళనగా ఉన్నట్లు బోరిస్ జాన్సన్ వివరించారు.

Updated Date - 2021-05-14T04:06:33+05:30 IST