హెల్త్‌ వర్కర్లకు తొలి విడత వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-16T05:56:48+05:30 IST

హెల్త్‌కేర్‌ వర్కర్లకు తొలి విడతతో కొవిడ్‌ వ్యాక్సిన్త్‌ వేయనున్నట్లు నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి తెలిపారు.

హెల్త్‌ వర్కర్లకు తొలి విడత వ్యాక్సిన్‌

  1.  నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి

నంద్యాల టౌన్‌, జనవరి 15: హెల్త్‌కేర్‌ వర్కర్లకు తొలి విడతతో కొవిడ్‌ వ్యాక్సిన్త్‌ వేయనున్నట్లు నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి తెలిపారు. పట్టణంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచిన సెంటర్లను శుక్రవారం పరిశీలించారు. సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీ యూనిట్‌ను హరిజనవాడలోని అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లను పరిశీలించారు. సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ రేవనూరు పీహెచ్‌సీ సెంటర్‌, బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో, పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వ ఉంచినట్లు తెలిపారు. నంద్యాల రెవిన్యూ డివిజన్‌ పరిధిలో 6 కేంద్రాలలో వ్యాక్సిన్‌ నిల్వ ఉంచినట్లు తెలిపారు. ప్రతి సెంటరులో ప్రతి రోజు 100 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట కృష్ణ, తహసీల్దార్‌ రవికుమార్‌, డాక్టర్‌ అంకిరెడ్డి తదితరులు ఉన్నారు.


చాగలమర్రి: జిల్లాలోని 27 ప్రభుత్వ వైద్యశాలల్లో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రామసుందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం చాగలమర్రి ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించి వ్యాక్సిన్‌ నిర్వహణ గురించి అధికారులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు 40,500 డోస్‌లు వ్యాక్సిన్‌ వచ్చిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను పోలీసు బందో బస్తు మధ్య ఆయా కేంద్రాలకు సరఫరా చేశామన్నారు. శనివారం జిల్లాలో 2,700 మంది వైద్య సిబ్బందికి మొదటి విడత కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి వికటిస్తే 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలిస్తామని తెలిపారు. రెండో విడతలో పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, వలంటీర్లకు, మూడో విడతలో 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్‌లు వేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని, మొదటి విడతలో వేయించుకున్న వారికి 28 రోజుల తరువాత రెండో డోసు వేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌లు వేయించుకున్న వారంతా యాంటిబైటిక్స్‌ పెరిగేందుకు రెండు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలన్నారు. 27 కేంద్రాలకు 500 వాయిల్స్‌ పంపిణీ చేశామని తెలిపారు. వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీప్యూటీ తహసీల్దార్‌ శివశంకర్‌రెడ్డి, వైద్యులు గంగాధర్‌, నారాయణరెడ్డి, ఈవోఆర్డీ లక్ష్మీనాగేంద్రయ్య, ఈవో సుద ర్శన్‌రావు, సీహెచ్‌వో రెడ్డెమ్మ, హెల్త్‌ ఎడ్యూకేటర్‌ వెంకటమ్మ, సూప ర్‌వైజర్లు రామలింగారెడ్డి, సీతారాములు, ప్రమీలమ్మ, మాలిబా షా, వీఆర్వో హసన్‌, ఆరోగ్యమిత్ర గురుప్రతాప్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

 చాగలమర్రి ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఉమా మహేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలను సంద ర్శించారు. జిల్లా నుంచి పోలీసు బందోబస్తు మధ్య తరలించిన వ్యాక్సి న్‌ వాయిల్స్‌ను పరిశీలించారు. శనివారం 100 మందికి వ్యాక్సినేషన్‌ చేస్తున్నట్లు తెలిపారు. వైద్యులు గంగాధర్‌, నారాయణరెడ్డి, సిబ్బంది రెడ్డెమ్మ, వెంకటమ్మ, రామలింగారెడ్డి, సీతారాములు, ప్రమీలమ్మ, మాలిబాషా, ఈవో సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గాని వెయ్యి కొవిడ్‌- 19 టీకాలు చేరాయి. కొవిడ్‌-19 టీకాలను నందికొట్కూరు పట్టణం, పాములపాడులోని ఆరోగ్య కేంద్రాలలో భద్రపరిచినట్లు నియోజకవర్గ ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌ తెలిపారు. నిల్వ చేసిన టీకాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. శనివారం నుంచి కొవిడ్‌ టీకాలను ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వాక్సినేషన్‌పై నియోకజవర్గ నోడల్‌ అధికారులు, డాక్టర్లు, తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు రాయుడు, రోషిణి పాల్గొన్నారు.


ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించి శ్రీశైలం నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించి వ్యాక్సినేషన్‌ ఏవిధంగా నిర్వహిస్తారన్న అంశాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో ఆత్మకూరు, వెలుగోడు మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆత్మకూరు సీహెచ్‌సీకి 500వ్యాక్సిన్లు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, ఎంఈవో జానకీరామ్‌, వైద్యాధికారులు వెంకటరమణ, మోతిలాల్‌నాయక్‌, ఆర్‌ఐ పెద్దన్న తదితరులు ఉన్నారు.


పాణ్యం: పాణ్యంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటరులో శనివారం నుంచి వ్యాక్సిన్‌ ను పంపిణీ చేస్తున్నట్లు నియోజక వర్గ ఇన్‌చార్జి అఽధికారి, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం ఆయన సీహెచ్‌సీని పరిశీలించారు. ఎంపీడీవో దస్తగిరి, డీటీ మల్లికార్జున రెడ్డి, సీహెచ్‌సీ వైద్యాఽధికారి డాక్టర్‌ రహేలా, మద్దూరు వైద్యాఽధికారి డాక్టర్‌ మల్లికార్జునరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


పాములపాడు: కరోనా టీకాను వేయటానికి సర్వం సిద్ధం చేశామని నందికొట్కూరు సీడీవో డాక్టర్‌ వేణగోపాల్‌ అన్నారు. శుక్రవారం పాములపాడులోని ప్రభుత్వ వైద్యశాలలోని ఐఎల్‌ఆర్‌లో భద్ర పరిచిన వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. 

Updated Date - 2021-01-16T05:56:48+05:30 IST