పల్స్‌పోలియో పద్ధతిలో కరోనా టీకాలు

ABN , First Publish Date - 2021-03-23T06:00:44+05:30 IST

మాన్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు ఈ క్రింది సూచనలను పరిశీలించాలని మనవి చేస్తున్నాను. టెస్ట్ ట్రేస్ ట్రీట్ పద్ధతి అమలుతో కరోనా...

పల్స్‌పోలియో పద్ధతిలో కరోనా టీకాలు

మాన్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు ఈ క్రింది సూచనలను పరిశీలించాలని మనవి చేస్తున్నాను. టెస్ట్ ట్రేస్ ట్రీట్ పద్ధతి అమలుతో కరోనా దండయాత్రను నిలువరించవచ్చునని ఆశిస్తున్నాను. పల్స్ పోలియో కార్యక్రమ అమలుకు అనుసరించిన పద్ధతులను కొవిడ్ వ్యాక్సినేషన్‌కు అమలుచేయవచ్చును. ప్రతి రోజూ కనీసం లక్ష మందికి టీకాలు వేయవచ్చును; ఫ్రంట్ లైన్‌వర్కర్స్ కుటుంబాలకు వ్యాక్సినేషన్ చేయించండి. కుటుంబాలను పక్కన పెట్టడంలో లాజిక్ లేదు. ముప్పయ్యేళ్ళు దాటినవారందరికీ వాక్సిన్‌ వేయాలి. గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీల్లోనూ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో విఆర్‌ఓ, విఏఓ వ్యవస్థల ద్వారా సంతలు రచ్చబండల వద్ద వాక్సినేషన్ స్టాల్స్ ఏర్పాటుచేయాలి. ప్రతి శని ఆది వారాలలో కర్ఫ్యూ విధించడం వలన కరోనా మనమధ్యనే ఉన్నదని ప్రజలను అప్రమత్తం చెయ్యడం; పర్యాటక ప్రదేశాలు పార్కులు మల్టీ మాల్స్ రైలు విమానాశ్రయాల్లో బస్టాండులో వంటి ప్రవేశ ద్వారాల్లో టెంపరేచరు ఆక్సిజన్ పల్స్ పరిశీలించడం, మాస్కుల పద్ధతి అమలు పరచడం; రాష్ట్ర సరిహద్దులలో TTT అమలు; కేన్సర్ టీబీ స్మోకింగ్ తరహా ప్రకటనల మాదిరిగా కరోనా ప్రకటనలు విరివిగా వెలువడాలి; పబ్లిక్ ప్లేసెస్‌లో శానిటేషన్ ముమ్మరంగా జరగాలి; నిర్వహణ అనువుగాని పబ్లిక్ టాయిలెట్స్‌ను మూసివేయాలి. అవే కరోనా బ్రీడింగ్ సెంటర్స్‌గా మారుతున్నాయి; సభలు సమావేశాలు సమూహాలకు పరిమితులు విధించండి.

డా. కెజెరావు, హైదరాబాద

Updated Date - 2021-03-23T06:00:44+05:30 IST