టీకా తీసుకోని డాక్టర్లు.. పారేస్తున్న ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-03-02T11:30:23+05:30 IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఓ దేశంలో కరోనా వ్యాక్సిన్లను ప్రభుత్వం పారేస్తోందిట. ఇదెక్కడంటే.. ఉక్రెయిన్ దేశంలో.

టీకా తీసుకోని డాక్టర్లు.. పారేస్తున్న ప్రభుత్వం!

ఉక్రెయిన్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఓ దేశంలో కరోనా వ్యాక్సిన్లను మెడికల్ సిబ్బంది చెత్తలో పారేస్తున్నారట. ఇదెక్కడంటే.. ఉక్రెయిన్ దేశంలో. ఇక్కడి డాక్టర్లు వ్యాక్సిన్ వేయించుకోవడానికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన సమయానికి రాలేదట. దీంతో చాలా మెడికల్ ఫెసిలిటీల్లో కరోనా టీకాలను పారేయాల్సి వచ్చిందని ఉక్రెయిన్ దేశ అధికార పార్టీ నేతలు చెప్పారు. ఇక్కడ గత వారమే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. తొలి విడతలో డాక్టర్లకు టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ డాక్టర్లు టీకా వేయించుకోవడానికి రాకపోవడంతో వ్యాక్సిన్ డోసులు చాలాచోట్ల పారేశారట. ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-02T11:30:23+05:30 IST