వెల్మల్‌ బొప్పారం ఆరోగ్య కేంద్రం వద్ద పోలీసుల పహరాపోలీసుల పహారాలో కరోనా టీకాలు

ABN , First Publish Date - 2021-05-12T06:48:27+05:30 IST

రెండో విడత టీకా కోసం ప్రజలు వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రాలకు పొట్టెత్తుతున్నారు.

వెల్మల్‌ బొప్పారం ఆరోగ్య కేంద్రం వద్ద పోలీసుల పహరాపోలీసుల పహారాలో కరోనా టీకాలు
వెల్మల్‌ బొప్పారం ఆరోగ్య కేంద్రం వద్ద పోలీసులు

సోన్‌, మే 11 : రెండో విడత టీకా కోసం ప్రజలు వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రాలకు  పొట్టెత్తుతున్నారు. ఉదయం నుండే వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద బారులు తీరడంతో వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారింది. మంగళవారం మండలంలోని వెల్మల్‌ బొప్పారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వ్యాక్సిన్‌ కోసం పెద్దమొత్తంలో తరలి వచ్చారు. వైద్యసిబ్బందికి వారిని నిలువరించడం సాధ్యపడలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగప్రవేశం చేసి కరోనా నివారణ వ్యాక్సిన్‌ పంపిణీ చేయించారు. అయితే వ్యాక్సిన్‌ తక్కువగా ఉండటంతో టీకా పంపిణీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతీరోజు వ్యాక్సిన్‌ కోసం గంటల తరబడి వరుసలో నిలబడే ఇబ్బందులు తప్పడం లేదు. 


Updated Date - 2021-05-12T06:48:27+05:30 IST