18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేయాలి : జేసీ సిరి

ABN , First Publish Date - 2021-10-23T05:47:52+05:30 IST

జిల్లాలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ శనివారం సాయంత్రంలోగా తప్పనిసరిగా కరోనా టీకా వేయాలని జేసీ డాక్టర్‌ సిరి ఆదేశించారు.

18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేయాలి : జేసీ సిరి
వ్యాక్సినపై సమీక్షిస్తున్న జేసీ సిరి

అనంతపురం వైద్యం అక్టోబరు 22: జిల్లాలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ శనివారం సాయంత్రంలోగా తప్పనిసరిగా కరోనా టీకా వేయాలని జేసీ డాక్టర్‌ సిరి ఆదేశించారు. శుక్రవారం వైద్యాధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలోని డిగ్రీ కళాశాలలు, ఫార్మసీ, పాలిటెక్నిక్‌ ఇ తర పీజీ కళాశాలల వివరాలు ఆరా తీశా రు. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఆ కు టుంబంలోని వ్యక్తులకు సోకే ప్రమాదముందని, అందుకే ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా టీకా వేయాలని సూచించారు. సమావేశంలో ఇనచార్జి డీఎంహెచఓ డాక్టర్‌ రామసుబ్బారావు, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నీరజ, డీఐఓ డాక్టర్‌ యుగంధర్‌,  ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్‌, పలు డిగ్రీ కళాశాలలు, జేఎనటీయూ, ఎస్‌కేయూ రిజిస్ర్టార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T05:47:52+05:30 IST