కృష్ణా: జిల్లాలోని మరో ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడింది. మైలవరం మండలంలోని పొందుగల ఎలిమెంటరీ పాఠశాలలో ఈ ఉపాధ్యాయురాలు పనిచేస్తోంది. ఉపాధ్యాయురాలికి కరోనా సోకడంతో పాఠశాలకు రెండు రోజుల సెలవులను అధికారులు ప్రకటించారు. అనుమానిత లక్షణాలున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరీక్షలు చేస్తున్నారు. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో శానిటేషన్ పనులను పంచాయతీ అధికారులు చేయిస్తున్నారు.