సీఎంసీలో వైద్య సిబ్బందికి Corona!

ABN , First Publish Date - 2022-01-10T15:59:50+05:30 IST

ప్రముఖ వైద్యశాల సీఎంసీని కరోనా చుట్టేసింది. ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 200 మందికి పాజిటివ్‌గా తేలింది. వేలూరు జిల్లాలో రోజురోజుకు కరోనా తీవ్రత అధికమవుతోంది...

సీఎంసీలో వైద్య సిబ్బందికి Corona!

చెన్నై/వేలూరు: ప్రముఖ వైద్యశాల సీఎంసీని కరోనా చుట్టేసింది. ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 200 మందికి పాజిటివ్‌గా తేలింది. వేలూరు జిల్లాలో రోజురోజుకు కరోనా తీవ్రత అధికమవుతోంది. దీనికి తోడు చుట్టుపక్కల జిల్లా లకు చెందిన వంద లాదిమంది కూడా సీఎంసీకి వస్తుం టారు. విషమ కేసులతో పాటు కరోనా కేసులు కూడా ఆస్పత్రికి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆస్పత్రి లోని వైద్యులు వరుసగా అనారోగ్యం పాలవుతుం డడంతో అనుమానించిన సీఎంసీ ఉన్నతాధికారులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో సుమారు 200 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల రోగులను సీఎంసీలో చేర్చుకోరాదని జిల్లా కలెక్టర్‌ కుమారవేల్‌ పాండ్యన్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఎంసీ ఆసుపత్రితో పాటు కరోనా కేసులు అధికం గా వున్న గాంధీరోడ్డు, బాబూరావు వీధి, సైదాపేట ప్రాంతా లను ఆదివారం పరిశీలించిన కలెక్టర్‌.. కరోనా బాధితులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

తిరుత్తణి ఆలయంలో పదిమందికి... 

ప్యారీస్‌: తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో పనిచేస్తున్న పదిమందికి కరోనా పాజి టివ్‌ నిర్ధారణ అయింది. ఈ ఆలయంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది ఒకేదగ్గర కానుకలు లెక్కించారు. ఈ నేపథ్యంలో సహాయ కమి షనర్‌ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడు తుండ డంతో ఆయనకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆలయంలో వున్న 118 మంది ఉద్యోగులు, ఇద్దరు అర్చకులు, 50 మంది కాంట్రాక్టు కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో పదిమందికి కరోనా సోకినట్లు తేలింది. బాధితులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2022-01-10T15:59:50+05:30 IST