Apr 9 2021 @ 00:40AM

నగ్మాకు కరోనా!

దేశంలో కరోనా బారిన పడుతున్న సినీ ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో నటి, కాంగ్రె్‌స పార్టీ నాయకురాలు నగ్మా కూడా చేరారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. ఏప్రిల్‌ 2న ఆమె కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నారు.