కోహ్లీకి కరోనా!

ABN , First Publish Date - 2022-06-23T08:51:44+05:30 IST

ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్‌ అయిన ఐదో టెస్ట్‌ ముందు కరోనా.. టీమిండియాను కలవరపెడుతోంది. టూర్‌ ప్రయాణానికి ముందు అశ్విన్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో అతడు జట్టుతో వెళ్లలేదు. అయితే, కోహ్లీ కూడా

కోహ్లీకి కరోనా!

ఆలస్యంగా వెలుగులోకి..

నేటినుంచి లీసెస్టర్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌


న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్‌ అయిన ఐదో టెస్ట్‌ ముందు కరోనా.. టీమిండియాను కలవరపెడుతోంది. టూర్‌ ప్రయాణానికి ముందు అశ్విన్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో అతడు జట్టుతో వెళ్లలేదు. అయితే, కోహ్లీ కూడా కరోనా బారినపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీ్‌సకు విశ్రాంతి తీసుకొన్న విరాట్‌.. భార్య, కుమార్తెతో కలసి విహార యాత్రకు మాల్దీవులు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు కొవిడ్‌ బారినపడ్డట్టు తెలిసింది. కోలుకున్న తర్వాతే టీమ్‌తో కలసి లండన్‌ వెళ్లినట్టు సమాచారం. కానీ, ఈ విషయమై బీసీసీఐ కానీ, కోహ్లీ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. తాజాగా లండన్‌లో రోహిత్‌, విరాట్‌ కరోనా నిబంధనలు పాటించకుండా షాపింగ్‌లకు వెళ్లడం, ఫ్యాన్స్‌తో కలసి సెల్ఫీలు దిగడం, కరచాలనాలు చేయడంపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీరినిబోర్డు హెచ్చరించనుందనే వార్తలు కూడా వచ్చాయి. 


అలా ఎవరూ చెప్పలేదు..

జట్టులోకి ఆటగాళ్లలో ఎక్కువ మంది కొవిడ్‌ బారిన పడడంతో.. గురువారం నుంచి 4 రోజులపాటు లీసెస్టర్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు భారత క్రికెటర్లు తీవ్రంగా సాధన  చేయవద్దని మెడికల్‌ స్టాఫ్‌ సూచించినట్టుగా వార్తలు వస్తున్నాయి. శారీకర శ్రమ తగ్గించాలని కూడా సలహా ఇచ్చినట్టు చెబుతున్నాయి. కానీ, మెడికల్‌ స్టాఫ్‌ అలాంటి సూచలేమీ చేయలేదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ‘ఆందోళన చెందాల్సినదేమీ లేదు. తేలిగ్గా ప్రాక్టీస్‌ చేయాలనే సూచనలు ఇవ్వలేదు. మంగళవారం ఐదు గంటలపాటు ప్రాక్టీస్‌ చేశార’ని ఆ అధికారి చెప్పారు. 


సహచరుల్లో జోష్‌ కోసం..

లీసెస్టర్‌తో వామప్‌ మ్యాచ్‌కు ముందు సహచరుల్లో స్ఫూర్తిని నింపే విధంగా కోహ్లీ.. వారితో మాట్లాడాడు. గతేడాది పర్యటనలో విరాట్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి టెస్ట్‌ ముందు భారత జట్టులో కొవిడ్‌ కేసులు వెలుగుచూడడంతో ఐదో టెస్ట్‌ను రీషెడ్యూల్‌ చేశారు. టీమిండియా ప్రాక్టీస్‌ ఫొటోలతోపాటు సహచరుల్లో ఉత్సాహం నింపేలాకోహ్లీ మాట్లాడుతున్న వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘గేమ్‌ మోడ్‌ యాక్టివేటెడ్‌’ అని ఈ వీడియోను లీసెస్టర్‌ షేర్‌ చేసింది. 

Updated Date - 2022-06-23T08:51:44+05:30 IST