May 11 2021 @ 04:48AM

ఎన్టీఆర్‌కి కరోనా

హీరో ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతిని సోమవారం ట్విట్టర్‌లో ఆయన వెల్లడించారు. ‘‘నాకు అంతా బాగానే ఉంది. ఎటువంటి ఆందోళన చెందకండి. నేనూ, నా కుటుంబ సభ్యులు ఐసోలేషన్‌లోకి వెళ్లాం. మేం వైద్యుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నాం. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్టే సేఫ్‌’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.