సీఎంవోలో కీలక అధికారికి కరోనా

ABN , First Publish Date - 2020-10-24T08:39:49+05:30 IST

ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో పని చేసే ఓ కీలక అధికారికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి

సీఎంవోలో కీలక అధికారికి కరోనా

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములుకు పాజిటివ్‌

కొత్తగా 1,421 కేసులు.. ఆరుగురి మృతి


హైదరాబాద్‌/కందనూలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో పని చేసే ఓ కీలక అధికారికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు నాగర్‌కర్నూల్‌ ఎంపీ  పోతుగంటి రాములు కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ మేరకు  వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్న వారు.. తమను కలిసిన కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాగా, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 40లక్షల మార్కును దాటాయి. రాష్ట్రంలో మార్చి2న తొలి కేసు నమోదు కాగా, ఆ నెలలో కేవలం 1,087 టెస్టులు మాత్రమే చేశారు. జూలై 3 నాటికి లక్ష, ఆగస్టు 24 నాటికి 10లక్షల మార్కును దాటాయి. అప్పటి నుంచి కేవలం 60 రోజుల వ్యవధిలోనే 30 లక్షల కరోనా టెస్టులు చేయడం గమనార్హం. ఆగస్టు 24 నుంచి టెస్టుల సంఖ్యను భారీగా పెంచడం వల్లే ఇది సాధ్యమైంది. కాగా, గురువారం రాష్ట్రంలో కొత్తగా 1,421 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా మహమ్మారిన పడిన వారి సంఖ్య 2,29,001కి చేరింది. వైరస్‌ కారణంగా ఆరుగురు మరణించారు.

Updated Date - 2020-10-24T08:39:49+05:30 IST