మరో 1,921 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-15T09:57:08+05:30 IST

రాష్ట్రంలో మరో 1,921 మంది కరోనా బారినపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో 1,921 మందికి కరోనా

రాష్ట్రంలో వైర్‌సతో 9 మంది మృతి


హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 1,921 మంది కరోనా బారినపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గురువారం 22,046 నమూనాలు సేకరించారు. వీటిలో 1,151 శాంపిల్స్‌ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.


కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీవి 356 కాగా.. మేడ్చల్‌లో 168, రంగారెడ్డి జిల్లాలో 134, సంగారెడ్డిలో 90, వరంగల్‌ అర్బన్‌లో 74, నల్లగొండ, కరీంనగర్‌లో 73, ఖమ్మంలో 71 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో బాధితుల సంఖ్య 88,396కు చేరింది. తాజాగా 1,210 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 64,284 మంది డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 674కు చేరింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5,824, ప్రైవేటులో 3,492 పడకలు  పడకలు ఖాళీగా ఉన్నాయని, వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 


నేను బాగానే ఉన్నా.. చపాతీ పంపండి

చెప్పిన గంటలోనే ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ (50)కు కరోనా సోకింది. వారం రోజులుగా మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. టిఫిన్‌గా చపాతీలు పంపాలని శుక్రవారం ఉదయం 6:30 గంటలకు కుటుంబ సభ్యులను కోరారు. కాసేపటికే చనిపోయారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పది రోజుల క్రితం జరిగిన వివాహ వేడుకకు హాజరైనవారిని కరోనా వెంటాడుతోంది. గురువారంతో 35 మందికి వైరస్‌ సోకగా.. శుక్రవారం 35 మంది పరీక్షలు చేయించుకుంటే 23 మందికి పాజిటివ్‌ అని తేలింది. 

Updated Date - 2020-08-15T09:57:08+05:30 IST