కరోనా వేళ.. నిర్లక్ష్యమేల!

ABN , First Publish Date - 2022-01-21T07:00:50+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ ని బంధనలు పాటించాలని చెబుతున్నా.. వాటిని అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. భౌతిక దూరం పాటించాల్సిన చో ట గుంపులుగా తిరుగుతున్నారు. నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారు. మాస్కు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా ఎక్కడా అమలు కావడం లేదు.

కరోనా వేళ.. నిర్లక్ష్యమేల!

జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు గాలికి

ధరించని మాస్కులు, పాటించని భౌతిక దూరం

పాజిటివ్‌ వచ్చినా జనంలో తిరుగుతున్న రోగులు

పట్టించుకోని అధికారులు

నేటి నుంచి జిల్లాలో ఇంటింటి సర్వే

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 20: జిల్లాలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ ని బంధనలు పాటించాలని చెబుతున్నా.. వాటిని అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. భౌతిక దూరం పాటించాల్సిన చో ట గుంపులుగా తిరుగుతున్నారు. నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారు. మాస్కు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా ఎక్కడా అమలు కావడం లేదు.

మూడో వేవ్‌లో కేసులు అధికం..

మొదటి, రెండో వేవ్‌లతో పోలిస్తే జిల్లాలో కరో నా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడో వేవ్‌లో అధికంగా ఉండడం ఆందోళనకరంగా మారు తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 30 శాతానికి పైగా ఉంటుండడంతో జిల్లా యంత్రాంగం అప్ర మత్తం అయింది. జిల్లాలో టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఐసొలేషన్‌ కేం ద్రాలను ఏర్పాటు చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి జిల్లాతో వ్యాపార లావాదేవిలు ఉండడం, రైలు, బస్సు మార్గాలు ఉండడంతో కొవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం జిల్లాలో 455 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే కొవిడ్‌ జిల్లాలో ఏవిధంగా వ్యాప్తిచెందుతుందో అర్థమవుతోంది. మొదటి, రెండో వేవ్‌లలో పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసొలేషన్‌ చికిత్స పొందేవారు. కానీ ప్రస్తుతం కరోనా వచ్చినప్పటికీ బయట తిరుగుతుండడంతో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా విచ్చల విడిగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా వాటికి సంబంధించిన రిపోర్ట్‌లను వైద్యశాఖ అధికారులకు తెలియజేయకపోవడంతో ఎవరికి కొవిడ్‌ ఉంది.. ఎవరికీ లేదు అనే విషయం తెలియడంలేదు.

ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటు...

మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యం త్రాంగం  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీ సెంటర్‌లు, కొన్ని ముఖ్యమైన కేంద్రాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పీహెచ్‌సీలలో కొవిడ్‌ ఔట్‌పేషంట్‌ విభాగాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, అవసరమైన మందులు, బెడ్స్‌, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కానరాని పోలీసు పికెట్‌

బోధన్‌ రూరల్‌: సాలూర అంతర్జాతీయ సరి హద్దు చెక్‌పోస్టులో పోలీసు పికెట్‌ కాన రాకుం డా పోయింది. అధికారులు వచ్చినప్పుడు హడా వుడి తప్ప పికెట్‌ కనిపించడం లేదు. దీంతో యథేచ్ఛగా మహారాష్ట్ర నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. అరకొర వైద్య సిబ్బందితో సేవ లందిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా విజృం భిస్తున్న నేపథ్యంలో చెక్‌పోస్టులో ప్రత్యేకంగా కరోనా వైద్య పరీక్షల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Updated Date - 2022-01-21T07:00:50+05:30 IST