Abn logo
Mar 27 2020 @ 05:14AM

కలిసికట్టుగా కరోనా కట్టడి

ప్రజలకు అందుబాటులో కూరగాయలు : ఎమ్మెల్యే కొట్టు 


తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 26: ప్రజలకు ఇబ్బంది లేకుండా కూర గాయలు అందించేందుకు మినీ రైతు బజార్‌ను ఏర్పాటుచేస్తున్నామని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం జడ్పీ ఉన్నత పాటశాల ఆవరణలో మినీ రైతు బజార్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. వ్యాపా రులు, సరు కుల ధరల పట్టిక ఏర్పాటుచేసి కూరగాయలు విక్రయించేలా ఏర్పాటు చేశామన్నా రు.


ప్రజలు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య ఇంటికి ఒకరు మాత్రమే బయ టకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ బాలస్వామి, ఎంపీడీవో జీవికే మల్లికార్జునరావు, తహసీల్దార్‌ సాయిరాజ్‌, సీఐ ఆకుల రఘు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


కరోనా కట్టడికి సహకరించండి : అబ్బయ్యచౌదరి

కరోనా మహమ్మారి కట్టడికి అందరూ సహకరించాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పిలుపునిచ్చారు. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలు అందించాల్సిన సహకారంపై అబ్బయ్యచౌదరి మాట్లాడారు. సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరూ సహకరిస్తేనే కరోనా వైరస్‌ను రాకుండా నిరోధించ గలమన్నారు. కొద్దిరోజులు ఇంటికే పరిమితం కావాలని, అదే మనం దేశానికి చేసే గొప్ప ఉపకారమని ఆయన వివరించారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను అభినందించారు.


Advertisement
Advertisement
Advertisement